ఆర్ ఆర్ ఆర్‌కి మళ్ళీ టైటిల్ కష్టాలు…!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. దాదాపు 400 కోట్లతో సినిమాను నిర్మించేందుకు సిద్దమయ్యారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. దీనితో ఈ సినిమాపై అభిమానులు ఏ చిన్న వార్త వచ్చినా సరే ఆసక్తిగా వింటున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి ఏదైనా వార్త వస్తే చాలు హడావుడి చేస్తున్నారు రెండు ఫ్యామిలీల అభిమానులు.

రెండు పెద్ద ఫ్యామిలీల హీరోల సినిమాలు కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వెయ్యి కోట్ల వసూళ్లు ఈ సినిమా సాధిస్తుంది అనే ప్రచారం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమాకు తాజాగా కష్టాలు వచ్చినట్టు సమాచారం. ముందు నుంచి ఈ సినిమా టైటిల్ ఎం ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. సినిమా ఖరారు అయిన తర్వాత, ముగ్గురు పేర్లు ఆర్ తోనే మొదలు అవుతాయి కాబట్టి ఆర్ ఆర్ ఆర్ అని భావించారు అందరూ. తర్వాత రాజమౌళి కూడా అదే విషయం చెప్పారు.

ముందు ఈ సినిమాకు రామ రావణ రాజ్యం అని అనుకున్నారు. అయితే ఆ సినిమా టైటిల్ ఇప్పటికే రిజిస్టర్ కూడా అయిపోయినట్టు సమాచారం. వి3 ఫిలిమ్స్ అనే సంస్థ ఈ సినిమా టైటిల్ ని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తుంది. మంచి క్రేజ్ ఉండటంతో టైటిల్ విషయంలో తొందర పడింది ఆ సంస్థ. వీళ్ళు సాగదీస్తూ రావడంతో టైటిల్ ని ఆ సంస్థ ఎగరేసుకుపోయింది. దీనితో ఇప్పుడు ఏ టైటిల్ పెట్టాలి అనేది చిత్ర యూనిట్ కి అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఇది టాలివుడ్ లో హాట్ టాపిక్ అయింది.

Share.