సరిలేరులో… ఎన్టీఆర్‌ని ఫాలో అవుతున్న మహేష్…!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినిమాకు పూర్తి స్థాయి న్యాయం చేయడానికి ప్రయత్నించే నటుల్లో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ఇద్దరూ కూడా నటుల పరంగా సినిమాకు ఏ లోటు రానీయరు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. సినిమా కోస౦ తమను తాము మార్చుకోవడానికి ప్రయత్నాలు గట్టిగా చేస్తారు. వేషం, భాష, బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతీ ఒక్కటి ఎప్పటికప్పుడు మార్చుకునే ప్రయత్నాలు చేస్తూ దర్శక నిర్మాతలకు అన్ని విధాలుగా సహకరిస్తూ అభిమానులను ఆకట్టుకుంటారు.

తాజాగా మహేష్ బాబు అదే చేస్తున్నాడని సమాచారం. అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ రాయలసీమ యాసతో అదరగొట్టాడు. ఆ సినిమాకు అదే ప్లస్ పాయింట్ అయింది కూడా. అందులో ఆ వాయిస్ కి రాయలసీమలో ఉండే జనం కూడా ఫిదా అయిపోయారు. దీనితో అక్కడ అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. ప్రతీ సన్నివేశంలో రాయలసీమలో పుట్టి పెరిగిన వాడిగా ఎన్టీఆర్ పలికించిన డైలాగులకు సీమలో అభిమానులు ఊగిపోయారు.

ఇప్పుడు మహేష్ బాబు అదే ఫాలో అవుతున్నాడని అంటున్నాయి టాలివుడ్ వర్గాలు. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కొన్ని సీన్లలో రాయలసీమ యాస లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడట మహేష్ బాబు. దీనిపై ఎన్టీఆర్ నుంచి కొన్ని సలహాలను కూడా సూపర్ స్టార్ తీసుకున్నాడని టాక్. అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ యాస మహేష్ ని కూడా ఆకట్టుకుంది. దీనితో ఈ సినిమాలో అలా ట్రై చేస్తున్నాడట. ఎక్కువ సేపు కాకపోయినా ఒక పది నిమిషాలు అయినా ఆ యాసలో మాట్లాడాలని చూస్తున్నాడట.

Share.