ఆడియో ఫంక్షన్‌కు అవి లేకుండానే వచ్చేసిన బ్యూటీ!

Google+ Pinterest LinkedIn Tumblr +

గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులు బాగా దగ్గరయిన బ్యూటీ రితికా సింగ్. ఆ సినిమాలో ఈ బ్యూటీ యాక్టింగ్‌ మరియు డెడికేషన్‌కు జనాలు ఫిదా అయ్యారు. ఆ తరువాత లారెన్స్‌తో కలిసి శివలింగా అనే సినిమాలో నటించింది ఈ బ్యూటీ. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపింలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘నీవెవరో’ మూవీతో రెడీ అయ్యింది. తాజాగా ఈ చిత్ర ఆడియో వేడుకలో ఈమెను చూసి అక్కడున్నవారు అందరు షాక్ అయ్యారు.

ఇంతకీ రితికాను చూసి అందరు ఎందుకు షాక్ అయ్యారు అనుకుంటున్నారా.. ఈ ఆడియో వేడుకకు రితికా చెప్పులు వేసుకోకుండానే ఉత్తి కాళ్లతో వచ్చేసింది. అదేంటి.. హీరోయిన్ చెప్పులు వేసుకోవడం మర్చిపోయిందా.. లేక వస్తున్న దారిలో చెప్పులు తెగిపోయాయా అని అక్కడున్నవారు సందేహ పడ్డారు. అసలు విషయం ఏమిటంటే.. రితికా ఈ ఆడియె వేడుకకు ముందు వేరు ఈవెంట్‌లో పాల్గొంది. అక్కడ స్పోర్ట్స్ షూస్‌ వేసుకున్న రితికా ఈ ఆడియో లాంఛ్ కోసం డ్రెస్ ఛేంజ్ చేసుకుంది. అయితే ఆమె వేసుకున్న డ్రెస్‌కు స్పోర్ట్స్ షూస్ అస్సలు సెట్ అవ్వవట. పోనీ వేరే చెప్పులు కొందామా అంటే ఆలస్యం అవుతుందని అనుకున్న రితికా అలాగే ఉత్త కాళ్లతో ఆడియో వేడుకకు వచ్చేసింది.

ఇలా చెప్పులు లేకుండా వచ్చిన హీరోయిన్‌ను చూసి తొలుత అందరూ షాక్ అయినా.. ఆ తరువాత అసలు విషయం తెలుసుకుని ఆమెను అభినందిస్తున్నారు. ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న నీవెవరో సినిమా ఈ నెల 24న రిలీజ్ కానుంది.

Share.