అది లేకుండానే వస్తానంటున్న రష్మిక

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ హీరో నాగశౌర్యతో ఛలో సినిమాలో నటించిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఆ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా గీత గోవిందం అనే సినిమాతో యావత్ టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్ ఇవ్వడంతో రష్మిక ఫుల్ హ్యాపీగా ఉంది. అప్పుడే తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్న రష్మిక ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది.

విజయ్ దేవరకొండతో మరోసారి జతకట్టనున్న రష్మిక డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటించనుంది. ఇప్పటికే ఈ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక ఒక క్రికెట్ ప్లేయర్‌గా కనిపిస్తుందట. దీనికోసం ఆమె ఈ సినిమాలో ఎలాంటి మేకప్ వేసుకోకుండా నటిస్తానంటోంది. పూర్తిగా డీగ్లామర్ పాత్రలో రష్మిక నటించనున్నట్లు తెలుస్తోంది. పక్కా యూత్‌ఫుల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కాలేజీ బ్యాక్‌డ్రాప్‌తో రానుంది.

డియర్ కామ్రెడ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రానున్న ఈ సినిమా రష్మిక కెరీర్‌లో మంచి సినిమాగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది ఈ బ్యూటీ. కాగా ఈ సినిమాను భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు.

Share.