రష్మీక మందన్న ఇప్పుడు చిత్రసీమలో రైజింగ్లో ఉన్న హీరోయిన్. రష్మీక మందన్న అందచందాలు కుర్రకారు గుండెల్లో గుబులుపుట్టిస్తుండంతో అనేక మంది హీరోలు కూడా ఆమే వెంట పడుతున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో మొదటి సినిమాగా గీతా గోవిందంతో జతకట్టింది. ఈ భామ. గీతా గోవిందం రష్మీక మందన్న కు మంచి పేరు తీసుకొచ్చింది. అవకాశాలు కూడా అంతే స్ఠాయిలో తెచ్చింది.
ఇక రష్మీక మందన్న గీతా గోవిందంతో జతతోనే డియర్ కామ్రేడ్ అంటూనే అదే రౌడీ హీరోతో మరోమారు జతకట్టింది. డియర్ కామ్రేడ్ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్, టీజర్, పాటలు యూత్ను ఆకట్టుకుంటున్నాయి. పాటలు బాగా పాపులర్ కావడంతో సినిమాపై బాగా హైప్ క్రియోట్ అయింది. అదే విధంగా విజయ్ దేవరకొండతో రష్మీక మందన్న లిప్లాక్ కిస్లు, చేసిన రోమాన్స్ యువతకు గిలిగింతలు పెట్టకున్నాయి.
దీంతో రష్మీక మందన్న కు టాప్ హీరో ప్రిన్స్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఇక దీంతో రష్మీక మందన్న పంట పండినట్లే అయింది. ఇప్పటి వరకు బాగానే ఉన్నా రష్మీకకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. అవకాశాలు వస్తున్న కొద్ది తన రేటును భారీగా పెంచేస్తుంది. ఇప్పటి వరకు రూ.50లక్షల వరకు తీసుకున్న రష్మీక ఇప్పుడు ఏకంగా కోటి రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తుందట. రష్మీకతో జత కట్టేందుకు అనేకమంది హీరోలు దర్శకుల వెంట పడుతున్నారట. దీంతో దీపం ఉండగాను ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటుంది ఈ చక్కని చుక్క.