ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ ఈ రోజు తన అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. అదేంటంటే తన శరీరం లోని తొడలని ఎవరైనా ఇన్సూర్యన్స్ చేసి ఇస్తారా అని ట్వీట్ చేసింది. ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో విలేకరి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘ నాకు అందమైన థైస్ ఉన్నందున అందరూ వాటి గురించి మాట్లాడుకుంటారని, అందులో అంతగా దాచాల్సిన విషయం ఏమిలేదని బోల్డ్ గా సమాధానం ఇచ్చింది ఈ బుల్లి తెర భామ. అంతే కాకూండా తన కాళ్ళకి ఎవరైనా కొంచం ఇన్సూర్యన్స్ చేసి పెట్టండని తెలిపింది, గతంలో నటి ఇలియానా కూడా ఇంతే తన అందమైన నడుముకి ఇన్సూర్యన్స్ చేయించుకుంది.
రష్మీ తాజాగా ‘అంతకు మించి ‘ అనే ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మీ ఈ వ్యాఖ్యలు చేయటం విశేషం. ఈ చిత్రంలో రష్మీ తొలిసారిగా కొన్ని ఘాటైన సన్నివేశాలలో నటించిందని ఇటీవలే విడుదలైన టీజర్స్ ని చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా ఈ నెల 24 వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది.
Insurance plsss 😂😂😂 https://t.co/ZLO3UAfbAW
— rashmi gautam (@rashmigautam27) August 21, 2018