నాకిప్పుడు 35 ఏళ్లు: రణ్ బీర్ కపూర్

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ స్టార్స్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ పై గత కొన్ని రోజులుగా అనేక కథనాలు సోషల్ మీడియా లో మరియు నేషనల్ మీడియా లో ప్రచురితం అవుతున్నాయి. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని ఇండస్ట్రీ లో టాక్. తాజాగా వీరిద్దరూ కలిసి బ్రహ్మస్త్ర సినిమాలో తొలి సారి జంటగా నటిస్తున్నారు. టాలీవుడ్ హీరో నాగార్జున, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

కొన్ని రోజుల క్రితం జరిగిన సోనమ్, ఆనంద్ అహుజా వివాహానికి కూడా వీరిద్దరూ కలిసే వచ్చారు, అప్పటి నుండి వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా బ్రహ్మాస్త్ర సెట్ లో వీరు కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

తాజాగా మీడియా వారు రణ్ బీర్ ని తన పెళ్లెప్పుడని ప్రశ్నించగా దానికి రణ్ బీర్ ” పెళ్లి అనేది ప్రేమతో ముడి పడిన విషయమని, అది సహజంగా ఇద్దరి మధ్య కలగాలని అంతే తప్ప నాకు ఇప్పుడు 35 ఏళ్లు వచ్చాయ్ కదా ఇంకా నేను పెళ్లి చేసుకోవాలి అంటే జరగదు అని వివరణ ఇచ్చాడు. ఇద్దరు ప్రేమించుకున్నాక ఇక పెళ్లి చేసుకోవటానికి ఇది సరైన సమయమని భావించిన తర్వాత పెళ్లి చేసుకోవటం మంచిదని చెప్పారు రణ్ బీర్.
ఇక తాజాగా అలియా భట్, రణ్ బీర్ కి ఎంతో ఇష్టమైన 8 వ నెంబర్ జెర్సీ ధరించటం కూడా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారనే వార్తకి బలం చేకూర్చినట్టు అయ్యింది.

Share.