సురేష్ ప్రొడక్షన్స్ ని ప్రశ్నించిన రానా!

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో రానా దగ్గుబాటి ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ‘ఈ నగరానికి ఏమైంది’ సక్సెస్ మీట్ కి తనని పిలవకపోవడం పై నేరుగా చిత్ర యూనిట్ ని మరియు తన సొంత నిర్మాణ సంస్థ అయినా సురేష్ ప్రొడక్షన్స్ ని ప్రశ్నించాడు. రానా తన అఫిషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా కొద్దీ సేపటి క్రితమే ఈ సరదా ట్వీట్ చేసారు. దీనికి నెటిజన్స్ పలు విధాలుగా స్పందించారు ‘ మీ తరపున మీ తండ్రి సురేష్ బాబు గారిని పిలిచారని’, ‘ జంబో ప్యాక్ తినే వాళ్ళని తరువాత పిలుస్తారట’ అని ‘మీరు ఎవరితోనైనా డేట్ లో ఉన్నారేమో’ ….ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు సరదాగా ట్వీట్స్ చేసారు.

ఇక ఈ రోజు విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా అన్ని ప్రాంతాలలో మంచి హిట్ టాక్ తో దూసుకు పోతుంది. దర్శకుడు తరుణ్ భస్కర్ కి ఈ మూవీ చక్కటి గుర్తింపు తీసుకురానుందనే చెప్పాలి. దర్శకుడు ఒక్కో క్యారెక్టర్ ని తీర్చి దిద్దిన విధానం నిజంగా అద్భుతంగా ఉందని సినిమా చూసిన ప్రేక్షాకుల స్పందన. నలుగురు విద్యార్థులు కలిసి సినిమా తీయాలనే వారి జీవత ఆశయాన్ని ఎ విధంగా చేరుకున్నారనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

Share.