‘నన్ను దోచుకుందువటే’ ఫస్ట్ లుక్

Google+ Pinterest LinkedIn Tumblr +

సుధీర్ బాబు, నాభ నటేష్ జంటగా నటించిన తాజా చిత్రం “నన్ను దోచుకుందువటే”. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని హీరో సుధీర్ బాబు ఈ రోజు ఉదయం విడుదల చేసారు. ఈ సినిమాని సుధీర్ బాబు తన సొంత బ్యానర్ ” సుధీర్ బాబు ప్రొడక్షన్స్” నిర్మాణ సంస్థ లో నిర్మిస్తున్నారు, ఇది సింధీర్ బాబు నిర్మిస్తున్న తొలి చిత్రం కావటం విశేషం. ఇందులో హీరోయిన్ గా కన్నడ నటీమణి నాభ నటేష్ నటిస్తుంది. తాజాగా విడుదలైన సుధీర్ బాబు చిత్రం ‘సమ్మోహనం’ మంచి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే, ఈ సందర్భంగా సుధీర్ బాబు తన చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలుపుతూ తన తదుపరి చిత్రం ‘నన్ను దోచుకుందువటే’ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు.
ఈ చిత్రం కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చిత్ర యూనిట్ ఇది వరకే తెలిపింది.ఈ చిత్రానికి ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు, ఆర్ ఎస్ నాయుడు కి ఇదే తొలి చిత్రం కావటం విశేషం.అజనీష్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకి తీసుకు వస్తామని చిత్ర బృందం ఈ సందర్భంగా తెలిపింది.

Share.