కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్స్ గా నిలుస్తూ… ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ.. వివాదస్పద అంశం ఎక్కడుంటే అక్కడ వాలిపోయే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఆ స్పీడ్ తగ్గించినట్టు కనిపిస్తున్నాడు. తన సహజశైలికి భిన్నంగా వర్మ ఇప్పుడు ఓ సినిమా విషయంలో వెనకడుగు వెయ్యడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏ సినిమా భారీ హిట్ కొట్టేందుకు సిద్ధం అవుతోంది. అయితే ఈ చిత్రానికి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సవాల్ విసిరాడు.
తన శిష్యుడు సిద్ధార్దని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న చిత్రం ‘భైరవగీత’. ఈ చిత్ర ట్రైలర్ కూడా ఈ మధ్యే విడుదలైంది. ఇది కూడా ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న చిత్రమే. ‘కొత్త దర్శకుడు సిద్ధార్ద చిత్రం ‘భైరవగీత’.. టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ సినిమా ‘అరవింద సమేత’తో ఢీకొట్టేందుకు రెడీ అయింది’’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.
అయితే మొదట.. సినిమాను ‘అరవింద సమేత’కు పోటీగా అక్టోబరు 12న విడుదల చేయడానికి వర్మ నిర్ణయం తీసుకున్నాడు. దీనికి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్లు కూడా వేశారు. అయితే ఈ సినిమాతో పోటీకి వెళ్తే మొదటికే మోసం వస్తుందని వర్మ భావించాడో ఏమో కానీ ఆ సినిమా డేట్ ని వాయిదా వేసుకున్నాడు. ముందుగా అనుకున్న డేట్ అక్టోబర్ 26 నే విడుదల చేసేందుకు ఆయన డిసైడ్ అయ్యారట. ఎన్టీఆర్ సినిమాతో పోటీ అంటే ఫలితం ఎలా ఉంటుందో వర్మకి ముందుగానే తెలిసిపోయినట్టు ఉంది.