యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా అక్టోబర్ 11న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దసరా బరిలో దుమ్ముదులిపేందుకు సిద్ధమవుతున్న తారక్ ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఈమధ్య తండ్రి హరికృష్ణ మరణించినా సరే నిర్మాత కష్టం గుర్తించి సినిమా అనుకున్న టైం కు రిలీజ్ అయ్యేందుకు షూటింగ్ కు వస్తున్నాడు ఎన్.టి.ఆర్.
సెప్టెంబర్ 22న ఎన్.టి.ఆర్ అరవింద సమేత ఆడియో రిలీజ్ కాబోతుంది. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్ వస్తున్నాడని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ కు గెస్ట్ గా రాం చరణ్ నిజంగా ఇది సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. స్టార్ హీరోల మధ్య సాన్నిహిత్యం పెరిగిన ఈ టైంలో ఆ బంధం మరింత బల పడేలా ఎన్.టి.ఆర్ సినిమా ఆడియోకి చరణ్ గెస్ట్ గా వస్తున్నాడు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న అరవింద సమేత సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతుంది. దసరా బరిలో దమ్ము చూపించడానికి వస్తున్న తారక్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. ఇక ఇదే ఈవెంట్ లో ఎన్టీఆర్ కి రామ్ చరణ్ ఒక సర్ ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్.