టాలీవుడ్‌లో రీసెంట్‌గా లాంఛ్ అయిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRR మూవీ గురించి ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమా ఎలాంటి స్టోరీతో వస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు జనాలు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సాధారణంగా రాజమౌళి సినిమాలో విజువల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈ సినిమాలో తారక్ కోసం ప్రత్యేకంగా డైలాగులపై ఇంట్రెస్ట్ పెట్టాడట జక్కన్న. డైలాగ్ డెలివరీకి తారక్ పెట్టింది పేరు. మరి ఇలాంటి పవర్‌ఫుల్ సినిమాలో తారక్ నోటి నుండి వచ్చే డైలాగులు ఎలా ఉండాలి? ఇదే కాన్సెప్టు ఆధారంగా ప్రముఖ రచయిత బుర్రా సాయి మాధవ్‌తో అదిరిపోయే డైలాగులు రాయించుకున్నాడు రాజమౌళి. ఇప్పటికే డైలాగ్‌లు పూర్తి కూడా అయిపోయాయట.
ఈ సినిమాలోని హైలైట్స్‌లో డైలాగులు కూడా ఒకటిగా ఉంటాయని ఆయన అంటున్నారు. ఇక తారక్ నోటి వెంట వచ్చే ఆ డైలాగులు థియేటర్స్‌లో ఎలా పేలుతాయో చూడాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే!
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ప్రారంభోత్సవం నిన్న ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రానికి ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. ఇప్పటికే సాయి మాధవ్ డైలాగ్ వెర్షన్ ను పూర్తీ చేశారట. సినిమాలో డైలాగ్ లు చాలా బాగా వచ్చాయని.. సినిమాలో ప్రధాన హైలెట్స్ లో డైలాగ్ లు కూడా హైలెట్ అవ్వనున్నాయని తెలుస్తోంది. రాజమౌళి తన సినిమాల్లో విజువల్స్ ని తప్ప.. డైలాగ్ లను పెద్దగా నమ్ముకొరు. కానీ ఈ చిత్రంలో రాజమౌళి డైలాగ్ లకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం విశేషం.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పూర్తి కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నారు. రామ్ చరణ్ కూడా కొత్త హెయిర్ స్టైల్ తో కనిపిస్తారట. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.