అలా చేస్తే అవకాశం ఇస్తా: లారెన్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

నటి శ్రీ రెడ్డి గత కొంత కాలంగా టాలీవుడ్ లో మహిళల పై జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ సమస్య పై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తనకి అవకాశాలు ఇస్తానని చెప్పి మోసం చేసిన ప్రముఖుల పై సోషల్ మీడియా లో పోస్టులు చేస్తుంది. ఇక తాజాగా డాన్స్ మాస్టర్ శ్రీ రాఘవ లారెన్స్ పై ఘాటైన వ్యాఖ్యలు చేసింది, తనని లారెన్స్ హోటల్ గది కి రమ్మని అసబ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించింది శ్రీ రెడ్డి.

దీనికి స్పందించిన లారెన్స్ నేను ఎటువంటి వాడినో అందరికి తెలుసునని, రెబెల్ సినిమా షూటింగ్ లో నువ్వు నన్ను కలిసావని చెప్పావ్..ఈ సినిమా విడుదలై 7 సంవత్సరాలు అయ్యింది మరి ఇన్ని ఏళ్లు ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నించాడు లారెన్స్. అంతే కాకుండా నీకు నిజంగా అంత టాలెంట్ ఉంటె నేను ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తా అందులో వారి ముందు నీకు ఒక రోల్ ఇస్తా దానికి నువ్వు మంచిగా నటించాలని అంతే కాకుండా అందరి ముంది కొన్ని డ్యాన్స్ స్టెప్స్ కూడా చేసి చూపించాలని తన లేఖలో పేర్కొన్నాడు లారెన్స్.
ఒక వేళా నీకు అందరి ముందు నటించటానికి ఇబ్బందిగా ఉంటె ని మేనేజర్, లాయర్ మరియు నీ మిత్రులతో మా మేనేజర్ ని సంప్రదించు నీకు నిజంగా ఒక నాటికీ కావాల్సిన అన్ని అర్హతలు ఉంటె నా తదుపరి చిత్రంలో నీకు ఒక మంచి రోల్ ఇస్తానని చెప్పాడు లారెన్స్. నా సినిమాలో నటించటం వలన నీకు మరి కొన్ని ఆఫర్స్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Share.