అలాంటి వారినే లొంగతీసుకుంటారు

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ ఒక ప్రధాన సమస్యగా ఉంది. అయితే ఈ విషయం పై గతంలో పలువురు సినీ పెద్దలు మరియు కొంత మంది స్టార్ హీరోయిన్స్ స్పందించి ఇటువంటి సమస్య ప్రతి ఇండస్ట్రీ లో సర్వ సాధారణమే అని వెల్లడించారు. అయితే ఈ రోజు ప్రముఖ నటి రాయి లక్ష్మి ని మీడియా వారు కాస్టింగ్ కౌచ్ పై మీ అభిప్రాయం తెలుపండి అని అడగ్గా దానికి బదులుగా రాయి లక్ష్మి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

రాయి లక్ష్మి స్పందిస్తూ ‘కాస్టింగ్ కౌచ్’ అనేది సినీ ఇండస్ట్రీ లోకి వచ్చినా కొత్త నటీమణులకు అధికంగా ఉంటుందని, కొత్తగా ప్రేవేశించిన వారికి అవకాశాల పేరుతో కొంత మంది పెద్దలు వారిని లొంగ తీసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది లక్ష్మి రాయి. అంతే కాకూండా అటువంటి వాటికీ ఒప్పుకోవటం సదరు నటీమణుల ఇష్టమని, అందుకే ఈ సమస్య ఇంకా ఇండస్ట్రీ లో కొనసాగుతూనే ఉందని వెల్లడించారు లక్ష్మి రాయి.

Share.