నటి పూనమ్ కౌర్ లాల్ గత కొంత కాలంగా సరైన అవకాశాలు లేక సినిమాలకు దూరంగా ఉంటున్నారనే చెప్పాలి. అయితే సోషల్ మీడియా లో మాత్రం ఎప్పుడు తన ఫోటో షూట్స్ తో మరియు కామెంట్స్ తో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పూనమ్ కి అవకాశాలు తగ్గిన నాటి నుండి టాలీవుడ్ లో ఒక ప్రముఖ దర్శకుడిని పేరు చెప్పకుండా పలుమార్లు దూషించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు తన అఫిషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా తెలుగు లో ఒక పేరొందిన వెబ్ సైట్ ని మరియు సదరు డైరెక్టర్ ని మరో సారి ధూషించింది.
https://twitter.com/poonamkaurlal/status/1012666534357975040
పూనమ్ తన ట్విట్టర్ లో ” ఫలానా వెబ్ సైట్ నిర్వాహకులు టాలీవుడ్ లో ఒక దర్శకుడి దగ్గర డబ్బులు తీసుకుని తన పై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని, నేను ఎప్పుడు సదరు డైరెక్టర్ ని అవకాశం ఇవ్వమని అడగలేదని చెప్పారు. ఇంకా స్త్రీలను ఈ విధంగా తక్కువ చేసి చూపటం సరైన పద్ధతి కాదని”, ఫలానా డైరెక్టర్ కొంత మంది మంత్రులకి, హీరోలకి కొమ్ము కాస్తుంటాడని ఆ పరిచయాలతోనే తన పై లేని పోనీ వార్తలు సృష్టించారని చెప్పింది పూనమ్.నేను ఎప్పుడు ఇండస్ట్రీ లో అందరితోనూ చాలా హుందాగా, గౌరవంగా ప్రవర్థించానని, ఇటువంటి వారిని ప్రోత్సహించకండని ట్వీట్ చేసింది.
అంతే కాకుండా సదరు డైరెక్టర్ టాలెంట్ ఉన్న వాళ్ళకంటే తనతో సన్నిహితంగా ప్రవర్థించే కథానాయకాలకే ఎక్కువ అవకాశాలు ఇస్తాడని ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
https://twitter.com/poonamkaurlal/status/1012667478982287360
https://twitter.com/poonamkaurlal/status/1012668798313197568