‘హ్యాపీ వెడ్డింగ్’ థియేట్రికల్ ట్రైలర్

Google+ Pinterest LinkedIn Tumblr +

సుమంత్ అశ్విన్, మెగా డాటర్ కొణిదెల నిహారిక జంటగా నటించిన తాజా చిత్రం ” హ్యాపీ వెడ్డింగ్ “. ఈ మూవీ కి చిత్ర యూనిట్ సభ్యులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. మొన్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా దానికి చక్కటి స్పందన వచ్చింది. అంతకు ముందు వివాహ పత్రిక అని ఒక మరొక లుక్ విడుదల చేయగా దానికి కూడా నెటిజన్స్ నుండి మంచి ఆదరణ లభించింది. ఇక రెండు రోజుల క్రితం నిహారిక ని ఒక పత్రిక విలేకరి మీ పెళ్లి ఎప్పుడు మేడం అని అడగ్గా ‘ దానికి ఫైరయినా నిహారిక అసలు న పెళ్లి మీ గురించి మీకెందుకు అని బదులిచ్చినా ప్రమోషనల్ వీడియో నెట్ లో వైరల్ గా మారి అందరికి ఎంతగానో నచ్చింది.
ఈ రోజు హీరో సుమంత్ అశ్విన్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేసారు. ట్రైలర్ ని బట్టి ఇది ఒక చక్కటి ప్రేమ కథ చిత్రం అని అర్ధం అవుతుంది. అంతే కాకుండా దర్శకుడు ఈ సినిమాలో మంచి కుటుంబ విలువలని కూడా జోడించాడని తెలుస్తుంది.’హాపీ వెడ్డింగ్’ సినిమాకి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించగా, శక్తి కాంత్ స్వరాలూ అందించారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Share.