బాలీవుడ్ నుండి హాలీవుడ్‌లోకి వెళ్లి సెటిల్ అయిన బ్యూటీ ప్రియాంక చోప్రా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే తన హాట్ వీడియోలతో ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరో హాట్ వీడియోతో రెచ్చిపోయింది. తనకన్నా వయసులో చిన్నవాడైన నిక్ జోనస్‌ను ప్రేమలో పడేసిన ఈ భామ హాట్ హాట్ లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది. అయితే ఈ వీడియోలో ప్రియాంక మద్దులు పెడుతోంది ఆమె ప్రియుడికి కాదు.
ప్రియాంక చోప్రా హాలీవుడ్ నటిస్తున్న క్వాంటికో సీరీస్ మూడో భాగానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ప్రియాంక తన సహనటుడితో అదిరిపోయే లిప్‌లక్ సీన్ చేసింది. ఈ సీన్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. క్వాంటికో సీరిస్ హాలీవుడ్‌లో పాపులర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ హాట్ హాట్ లిప్ లాక్ సీన్ క్వాంటికో 3కి సంబంధించింది కావడంతో జనాలు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ హాట్ లిప్‌లాక్ చూసిన ప్రియాంక లవర్ నిక్ జోనస్ షాక్‌లో ఉన్నాడు.
ఇప్పటికే నిక్ జోనస్‌తో ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయినట్లు ప్రియాంక గతంలో తెలిపింది. వీరిద్దరు అతి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రియాంక పెళ్లి ఫిక్స్ అయినా కూడా హాట్ లిప్‌లాక్‌లకు సై అంటుండటంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. మరి పెళ్లి తరువాత కూడా ప్రియాంక ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతుందా లేక పక్కన పెడుతుందా అనేది చూడాలి.