టాప్ హీరోతో ప్రియా ప్రకాష్

Google+ Pinterest LinkedIn Tumblr +

బడికి పోయే చిన్నది… అదే తరగతిలో అమ్మాయితోనే చదువుకునే అబ్బాయి ఆటపట్టిస్తాడు… దీంతో రెచ్చిపోయిన అమ్మాయి అబ్బాయికి కన్నుగీటుతుంది… దీంతో అబ్బాయి తబ్బిబ్బయిపోతాడు.. ఇలా ఒక కన్ను కొట్టే సీన్ ను దర్శకుడు తన సినిమా ప్రమోషన్లో భాగంగా ట్రైయిలర్లో రిలిజ్ చేశాడు. ట్రైయిలర్ ను చూసిన కుర్రకారు కన్నుగీటిన సీన్ను చూసిందే చూసి ఆ అమ్మాయిని రాత్రికి రాత్రే సెలబ్రెటీని చేశారు. ఇలా ఓవర్నైట్లో సెలెబ్రెట్ అయిన అమ్మాయే ప్రియ ప్రకాశ్ వారియర్.

ఓరు ఆధార్ లవ్ సినిమాలో మామూలు అమ్మాయిగా అవకాశం దక్కించుకున్న ప్రియా ప్రకాశ్ ఇప్పుడు అవకాశాలు తన్నుకొస్తుండటంతో టాప్ హీరోయిన్గా మారిపోయింది. ఇదే సినిమాను తెలుగులో లవర్స్ డే టాలీవుడ్ జనాలకు దగ్గరైంది. కానీ అనుకున్న మేరకు ఈ సినిమా జనాల్లోకి చోచ్చుకెళ్ళలేక పోయింది. అనువాదం సినిమాతో తెలుగు ప్రజలకు దగ్గరైన ప్రియ ప్రకాశ్ వారియర్ ఇప్పుడు నేరుగా తెలుగు లోనే హీరోయిన్ గా నటించబోతోంది…

నితిన్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా నటించబోతున్నట్లు టాలీవుడ్లో టాక్. నితిన్ ఇప్పుడు భీష్మ సినిమాలో వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. ఈ సినిమా పూర్తి అయిన తరువాత భవ్య క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమాకు దర్శకత్వం చంద్రశేఖర్ యేలేటీ . ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనున్నదట. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ ఓకే అయితే తెలుగు ప్రేక్షకులకు పండుగే పండుగ.

Share.