దుమ్మురేపిన సాయి తేజ్ ‘ ప్రతిరోజూ పండ‌గే ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌…

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాహీరో సాయి తేజ్ కొత్త చిత్రం ‘ప్రతిరోజూ పండగే’ . చిత్ర‌ల‌హ‌రి లాంటి హిట్ సినిమా త‌ర్వాత సాయి న‌టిస్తోన్న ఈ సినిమా జాత‌కం మ‌రి కొద్ది గంట‌ల్లో తేలిపోనుంది. యంగ్ హిట్ డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ సినిమా ఈ నెల 20న రిలీజ్ కానుంది. కంప్లీట్ ఫ్యామిలీ జోన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాపై
ముందు నుంచి ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది.

తాత‌, మ‌న‌వ‌డు ఫ్యామిలీ సెంటిమెంట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా ట్రైలర్, పాటలు అన్నీ బాగుండటంతో చిత్రం కూడా అలరిస్తుందనే నమ్మకం ఏర్పడింది అందరిలో. పైగా తేజ్ గత చిత్రం ‘చిత్రలహరి’ హిట్ కావడంతో సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ భారీగానే జరిగిందట. ఒక‌ప్పుడు సాయి సినిమాలు రు.25- 30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేశాయి.

అయితే వ‌రుస ప్లాపుల‌తో మ‌ళ్లీ సాయి మార్కెట్ కాస్త డౌన్ అయ్యింది. ఇక చిత్ర‌ల‌హ‌రి హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు ఈ సినిమాకు మ‌ళ్లీ మార్కెట్ పుంజుకుంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా యొక్క వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు సుమారు రూ.17 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. సో.. ఈ మొత్తం రికవర్ కావాలంటే సినిమా భారీ హిట్ అవ్వాలి.

ఇక తేజ్ గత సినిమా ‘చిత్రలహరి’ వసూళ్లు చూస్తే రూ.13 కోట్ల వరకు టచ్ అయింది. దీన్నిబట్టి ‘ప్రతిరోజూ పండగే’ కుటుంబ కథా చిత్రం కాబట్టి తొలిరోజు మంచి టాక్ తెచ్చుకుంటే భారీ విజయం పెద్ద కష్టమేమీ కాదు.

Share.