టాలీవుడ్ స్టార్ హీరో జంట విడాకులు…!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రేమించి వివాహం చేసుకోవడం… విడిపోవడం… మూడు ముళ్ళు వేసి వివాహ బంధంతో ఒక్కటైనా జంటలు అభిప్రాయ భేదాలు అంటూ విడిపోవడం, సిని పరిశ్రమలో ఏడాదికి ఒకటి అయినా సరే ఇది జరుగుతూనే ఉంది. ఎన్నో జంటలు ఇలా సిని పరిశ్రమలో వివాహ బంధం నుంచి బయటకు వచ్చేసాయి. ఈ ఏడాది మంచు మనోజ్, శ్వేతా బసు ప్రసాద్ వంటి వారు విడాకులు తీసుకున్నారు. అభిప్రాయ భేదాలతోనే వారు తమ వివాహ బంధానికి ముగింపు పలకడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది.

త్వరలోనే ఒక జంట కూడా తమ వివాహ బంధానికి ముగింపు పలికే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఆరు ఏళ్ళ క్రితం వివాహం చేసుకున్న ప్రముఖ హీరో ఇప్పుడు తన భార్య నుంచి విడాకులు కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీళ్ళ మధ్య కొంత కాలంగా విభేదాలు ఉన్నాయని అందుకే వాళ్ళు ఇప్పటి వరకు పిల్లలను కూడా కనలేదని అంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దలకు ఈ విషయాన్ని వాళ్ళు ఈ ఏడాది మొదట్లో చెప్పారని, వాళ్ళు సర్ది చెప్పారని అంటున్నారు.

హీరో భార్య బ్యాక్ గ్రౌండ్ కాస్త బలంగా ఉండటంతో కాపురాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అది ఫలించడం లేదని అంటున్నారు. హీరో తండ్రి కూడా ఇద్దరితో మాట్లాడిన సరే… వాళ్ళు కలిసి ఉండటానికి ఎంత మాత్రం అంగీకరించలేదని అంటున్నారు. వచ్చే ఏడాది మార్చ్ లో వీళ్ళు విడిపోయే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. కొంత కాలంగా వీరు వేరుగా ఉంటున్నారని భర్త హైదరాబాద్ లో ఉంటే భార్య చెన్నై లో ఉంటుందని ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ కూడా జరుగుతుంది.

Share.