బాలయ్యతో సినిమా కోసం కుర్ర హీరోయిన్ల ఆసక్తి…?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ.. సినిమా హిట్ ఫ్లాప్ అనే దానితో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేస్తున్నారు. కుర్ర హీరోలు కూడా ఇప్పుడు బాలకృష్ణ తో పోటీ పడే పరిస్థితి లేదని, దర్శక నిర్మాతలకు బాలకృష్ణ ఇప్పుడు కల్పతరువు లా మారారని అంటున్నారు. కథ వినడం ఆలస్యం నచ్చితే ఓకే చేస్తున్నారని సమాచారం. ఇక ఇప్పుడు ఆయనతో మరిన్ని సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలోనే ఒక వార్త బయటకు వచ్చింది. బాలయ్య తో సినిమా కోసం యువ హీరోయిన్లు ఎక్కువగా పోటీ పడుతున్నారట. దానికి కారణం ఏంటీ అంటే… బాలకృష్ణ పక్కన సినిమా చేస్తే తమకంటూ ఒక గుర్తింపు ఉంటుంది, ఆ సినిమా హిట్ అయితే తమకు అవకాశాలు వస్తాయని భావిస్తున్నారట. ఇతర హీరోలు అయితే తమకు ఉన్న స్టార్ ఇమేజ్ చూసుకుని అతి చేస్తారని బాలకృష్ణ అయితే అలా ఉండరని… ఆయన ఎంత సేపు కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని చూస్తారని, అందుకే పోటీ ఆసక్తి చూపిస్తారట.

ఇక సినిమా షూటింగ్ సమయంలో కూడా బాలకృష్ణ అయితే ఇబ్బంది ఉండదు అనే భావన కొందరు సీనియర్ హీరియిన్లలో కూడా ఉన్నట్టు టాక్. షూటింగ్ సమయంలో అలా ఉండాలి ఇలా ఉండాలి అన్నట్టు బాలకృష్ణ ఉండరని, సమయ పాలన అనేది ఆయనలో ఎక్కువగా ఉంటుందని హీరోయిన్లు భావిస్తున్నారట. బాలకృష్ణ చాలా సినిమాల్లో ఎక్కువగా కొత్త హీరోయిన్లకే అవకాశాలు ఇస్తున్నారు. ఇక వాళ్లకు తెలుగు కూడా నేర్పుతారని అంటూ ఉంటారు.

Share.