టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఎన్‌టిఆర్ బయోపిక్ కూడా ఒకటి. తెలుగు ప్రజల ఆల్‌టైమ్ ఫెవరెట్ యాక్టర్ నందమూరి తారక రామారావు జీవితకథ ఆధారంగా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య తన తండ్రి పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలోని మిగతా పాత్రలకు సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చినా చాలా ఆసక్తిగా చూస్తున్నారు జనాలు.
ఇటీవల ఈ సినిమాలో బసవతారకం పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్‌ను సెలెక్ట్ చేశారు చిత్ర యూనిట్. ఇప్పుడు మరో కీలక పాత్ర కోసం తెలుగు సీనియర్ నటి ఆమనిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ రెండో భార్య అయిన లక్ష్మీపార్వతి పాత్రలో నటించేందుకు ఆమని అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించారట. ఇదే విషయంపై ఆమెను సంప్రదించాలని చూస్తున్నారు. మరి లక్ష్మీ పార్వతి పాత్రను ఈ సినిమాలో ఎలా చూపిస్తారు అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. నిజ జీవితంలో నందమూరి బాలకృష్ణకు లక్ష్మీపార్వతితో అంత సత్సంబంధం లేకపోవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌లో ఈ పాత్ర చాలా చర్చనీయాంసంగా మారింది.
దర్శకుడు కిృష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా అశ్విని దత్, విష్ణు ఇందురి, బాలయ్యను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తుండగా అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ నటిస్తున్నారు.