ఈ హాట్ హీరోయిన్ సీనియర్లకే పనికొస్తుందా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆరెక్స్ 100 సినిమాతో తెలుగులో ఐదారు సినిమాల క్రేజ్ తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ తెలుగులో ఊహించని విధంగా క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు అమ్మడు యువ హీరోల సరసన నటించడం కన్నా సీనియర్ స్టార్స్ తో జోడీ కట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుందట. బాలీవుడ్ సీరియల్స్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ అమ్మడు ఆరెక్స్ 100 హిట్ తో సూపర్ హిట్ అందుకుంది.

ఈమధ్యనే వెంకీమామ సినిమాతో హిట్ అందుకున్న పాయల్ రాజ్ పుత్ ఆ సినిమాలో అమ్మడు వెంకీకి పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంది. సినిమా హిట్ అవడంతో పాయల్ కు మంచి ఫాలోయింగ్ పెరిగింది. వెంకీమామ హిట్ అవడంతో పాయల్ కు మళ్లీ అవకాశాలు వెళ్లువ మొదలైంది. వెంకటేష్ అసురన్ సినిమాలో కూడా పాయల్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో పాటుగా నాగార్జున నెక్స్ట్ సినిమాలో కూడా సెలెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. తెలుగులో అతి కొద్ది టైంలోనే హాట్ హీరోయిన్ ఇమేజ్ అందుకున్న పాయల్ రాజ్ పుత్ సీనియర్ స్టార్స్ కు పర్ఫెక్ట్ హీరోయిన్ గా జోష్ కొనసాగిస్తుంది.

Share.