స్టార్ హీరో సరసన నటించనున్న ఆర్ఎక్స్ బ్యూటీ పాయల్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే సక్సెస్ కొట్టిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇందులో జాయిన్ అయిన లేటెస్ట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఈ పేరుతో ఈమెను పెద్దగా గుర్తుపట్టని వారు కూడా RX 100 హీరోయిన్ అనగానే ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా ఆమె పాత్ర సినిమా సక్సెస్‌కు కారణమైంది. అందంతో పాటు బోల్డ్‌నెస్‌తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని ఓకే చేసింది.

మాస్‌రాజా రవితేజ హీరోగా విభిన్న సినిమాల దర్శకుడు విఐ ఆనంద్ తెరకెక్కించనున్న నెక్ట్స్ మూవీలో పాయల్ కూడా ఒక హీరోయిన్‌గా నటించనుంది. ఇప్పటికే ఈ సినిమాలో నన్ను దోచుకుందువటే ఫేం నభా నటాషా ఒక హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు పాయల్ కూడా ఈ సినిమాను సైన్ చేయడంతో ఈమె పాత్ర ఇందులో ఎలా ఉంటుందా అని ఆశగా చూస్తున్నారు ఫ్యాన్స్. కాగా ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ కూడా ఉందట. ప్రస్తుతం ఆమె కోసం వేట కొనసాగుతోంది.

ఈ సినిమాలో నటించే ముగ్గురు హీరోయిన్లకు అదిరిపోయే రోల్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెలలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి పాయల్ పాప ఈ సినిమాలో ఎలా రెచ్చిపోనుందా అని యూత్ ఇప్పట్నుండే ఎదురుచూస్తున్నారు.

Share.