ఏది ఏమైనా.. తారక్ మాత్రమే కావాలట!

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా తన స్టామినా చూపించాడు. బిగ్ బాస్ సీజన్ 1 రియాలిటీ షోతో బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేశాడు తారక్. అయితే బిగ్ బాస్ సీజన్ 2ని నాని హోస్ట్ చేయడంతో తారక్ ఇక బిగ్ బాస్ ఎప్పటికీ చేయడు అనే వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేసింది. అయితే బిగ్ బాస్ 1 కంటే కూడా సీజన్ 2‌లో బాగా వివాదం రేగడంతో నాని మరోసారి బిగ్ బాస్ హోస్ట్ చేయను అని తేల్చి చెప్పేశాడు.

దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ 3కి హోస్ట్‌గా మరోసారి తారక్‌ను దించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు తారక్ టీమ్‌తో చర్చలు కూడా జరుపుతున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. రాజమౌళి డైరెక్షన్‌లో RRR మూవీ కోసం తారక్ రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమాతో తారక్ బిజీగా ఉండనున్నాడు. అందుకే డేట్లు అడ్జస్ట్‌ చేసి తారక్‌ను ఈ షోతో మరోసారి బుల్లితెరపై మెరుపులు మెరిపించాలని చూస్తున్నారు నిర్వాహకులు.

ఒకవేళ తారక్ ఈ షోకు మరోసారి ఒప్పుకుంటే బుల్లితెర రికార్డులు తిరగరాయడం ఖాయం అని అంటున్నారు జనాలు. ఏదేమైనా తారక్ మరోసారి బిగ్ బాస్ హోస్ట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Share.