స్టార్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో RRR సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్- ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టు వచ్చే ఏడాది విడుదలవుతున్న సంగతి తెలిసిందే. డీవీవీ ప్రొడక్షన్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన పుట్టినరోజు జరుపుకున్న ఎన్టీఆర్ తనను కలిసేందుకు ఇంటికి వచ్చిన అభిమానులతో అనేక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తాను ప్రస్తుతం నటిస్తున్న RRR ప్రాజెక్టు తర్వాత మరో సారి త్రివిక్రమ్తో సినిమా చేస్తానని స్వయంగా చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో గత ఏడాది వచ్చిన అరవింద సమేత మంచి సినిమాగా ప్రశంసలు అందుకుంది. అరవింద సమేత రికార్డులు తిరగరాయకపోయినా త్రివిక్రమ్ టేకింగ్ ఎన్టీఆర్కు నచ్చడంతోనే అరవింద సమేత టైమ్లోనే వీరిద్దరూ మరో సినిమా చెయ్యాలని అనుకున్నారు. అందుకే RRR తర్వాత మళ్లీ ఎన్టీఆర్, త్రివిక్రమ్కే కమిట్ అయినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ బన్నీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక RRR షూటింగ్ కంప్లీట్ అయ్యేందుకు మరో ఏడాదికి పైగా టైమ్ ఉంది. ఈ ఏడాదిలోగా వీరిద్దరి కమిట్మెంట్స్ను బట్టి మరో సారి ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కే ఛాన్సులు ఉన్నాయి. అదే టైమ్లో చరణ్ కూడా త్రివిక్రమ్తో సినిమా చెయ్యాలని ఫిక్స్ అవ్వడంతో త్రివిక్రమ్ ముందుగా ? ఎవరికి ఓటేస్తాడో చూడాల్సి ఉంది.

Share.