పవన్ సినిమా కథతో ఎన్టీఆర్

Google+ Pinterest LinkedIn Tumblr +

త్రివిక్రం ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించగా ఈషా రెబ్బ కూడా మరో హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమా కథను పవన్ కోబలి నుండి తీసుకున్నాడని తెలుస్తుంది. పవన్ కోసం త్రివిక్రం కోబలి అంటూ ఓ కథ సిద్ధం చేసుకున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో అసలు ఫ్యాక్షనిజం ఎలా పుట్టింది అన్న విధంగా ఈ కథ ఉంటుంది. సినిమా టైటిల్ గా కూడా కోబలి అని పెట్టారు. కాని ఆ సినిమా ఎందుకో తెరకెక్కలేదు.

ఇప్పుడు పవన్ కోబలి కథనే కాస్త అటు ఇటుగా మార్చి అరవింద సమేత సినిమా తీశారని తెలుస్తుంది. సినిమా ట్రైలర్ చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేయగా ఈ దసరాకి ఎన్.టి.ఆర్ మరోసారి తన సత్తా చాటుతాడని తెలుస్తుంది.

Share.