బాలయ్యతో గేమ్ ఆడుతున్న ఎన్‌టిఆర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఎన్‌టిఆర్ బయోపిక్ చాలా ప్రాముఖ్యతను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుండగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తెలుగు ప్రేక్షకుల ఆల్‌టైమ్ ఫేవరెట్ హీరో నందమూరి తారక రామారావు జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌లో నందమూరి బాలకృష్ణ నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో సైతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఎన్‌టిఆర్ చిత్రం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ విషయంలో ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రైట్స్‌ను బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ రూ.80 కోట్ల భారీ రేటును ఆఫర్ చేసిందంటూ ఇండస్ట్రీలో వార్త వినిపిస్తోంది. అయితే బాలయ్య కెరీర్‌లో రూ.50 కోట్లు దాటిన సినిమాలు లేకపోవడంతో ఇంత భారీ మొత్తం ఎవరు ఆఫర్ చేశారా అని ఆరా తీస్తున్నారు సినీ జనం. అటు క్రిష్ మార్కెట్ కూడా రూ.50 కోట్లు లేకపోవడంతో ఈ వార్త కేవలం పుకారు మాత్రమే అని అంటున్నారు విశ్లేషకులు.

మొత్తానికి ఎన్‌టిఆర్ చిత్రం బాలయ్యతో గేమ్ ఆడుతోందని నందమూరి అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య ఏకంగా 60 గెటప్‌లతో రెచ్చిపోనున్నాడు. బాలీవుడ్ భామ విద్యా బాలన్ బసవతారకం పాత్రలో నటించనున్న ఈ సినిమాను సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి బాలయ్య ప్రొడ్యూస్ చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరిలో రిలీజ్ చేయనున్నారు.

Share.