టాలీవుడ్‌లో ప్రస్తుతం తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో ఎన్టీఆర్ బయోపిక్ చాలా ప్రత్యేకమైనదని చెప్పాలి. తెలుగు ప్రజల ఎవర్‌గ్రీన్ యాక్టర్ నందమూరి తారక రామారావు జీవితకథను ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అటు ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో సైతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఎన్టీఆర్ బయోపిక్ అంటే మామూలుగా ఉండబోదని ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ చూస్తే అర్ధమవుతోంది. చాలా మంది నటీనటులు నటిస్తున్న ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్న బాలయ్య, అంతే ప్రెస్టీజియస్‌గా ప్రతి క్యారెక్టర్‌ను తీర్చి దిద్దుతున్నారు. ఎన్టీఆర్ జీవితంలో సూపర్‌స్టార్ కృష్ణ పాత్ర కూడా చాలా స్పెషల్. వారిద్దరు కలిసి వెండితెరను పంచుకున్నారు. కొన్ని కారణాల వల్ల వారు వేరైనా కూడా వారి మధ్య ఉన్న బంధం గురించి చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌లో కృష్ణ పాత్రను ఆయన కుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయించాలని బాలయ్య స్వయంగా మహేష్‌కు ఫోన్ కూడా చేశాడట. అయితే ప్రస్తుతం షూటింగ్ కోసం అమెరికాలో ఉన్న మహేష్ ఈ సినిమాలో నటించేది లేనిది అనే విషయంపై తన నిర్ణయం తిరిగి వచ్చిన తరువాత చెబుతానన్నాడు.
దీంతో మహేష్ రాక కోసం ఆశగా వెయిట్ చేస్తున్నారు ఎన్టీఆర్ టీమ్. మహేష్ ఓకే చెబితే ఇక ఆ రచ్చ మామూలుగా ఉండదని వారు అంటున్నారు. కానీ మహేష్ నో చెబితే మాత్రం కృష్ణ పాత్రను సినిమా నుండి లేపేయాలని ఫిక్స్ అయ్యాడట బాలయ్య. మరి ఏం జరుగుతుందో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.