క్రియేటివ్ డైరక్టర్ తో నితిన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో క్రియేటివ్ డైరక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. అయితే ఎక్కడో ఓ చోట కాంప్రమైజ్ అయ్యి వారు కూడా కమర్షియల్ ఎంటర్టైనర్స్ తీస్తుంటారు. కాని మొదటి సినిమా నుండి ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా కేవలం క్రియేటివ్ గా ఆలోచించిన దర్శకుడు మాత్రం ఒక్క చంద్రశేఖర్ యేలేటి మాత్రమే. ఐతే సినిమా నుండి మూడేళ్ల క్రితం వచ్చిన మనమంతా సినిమా వరకు యేలేటి తన సత్తా చాటుతూ వచ్చాడు.

ఇక ఇప్పుడు యువ హీరో నితిన్ తో సినిమాకు సిద్ధమయ్యాడు. నితిన్ తో యేలేటి సినిమా కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్నా ఫైనల్ గా హోళీ పండుగ సందర్భంగా గురువారం ఎనౌన్స్ చేశారు. నితిన్ అఫిషియల్ గా తన ట్విట్టర్ లో చంద్రశేఖర్ యేలేటితో సినిమా అంటూ ట్వీట్ చేశాడు. అసలైతే ఛలో డైరక్టర్ వెంకీ కుడుముల డైరక్షన్ లో భీష్మ సినిమా చేయాలని అనుకున్నాడు నితిన్. మధ్యలో ఏమైందో ఏమో కాని నితిన్ మళ్లీ యేలేటితో సినిమా చేస్తున్నాడు.

డిఫరెంట్ సబ్జెక్ట్ తో వస్తున్న ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు నితిన్. శ్రీనివాస కళ్యాణం సినిమా తర్వాత నితిన్ చేస్తున్న ఈ సినిమా యేలేటి డైరక్షన్ లో రావడంపై సిని ప్రియులు ఎక్సైటింగ్ గా ఉన్నారు. మనమంతా తర్వాత 3 ఏళ్లు గ్యాప్ ఇచ్చిన యేలేటి నితిన్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

Share.