రోమ్ వెళ్లి రొమాన్స్ చేస్తున్న తెలుగు హీరో, హీరోయిన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ఒక యువ జంట రోం వెళ్లి మరి రొమాన్స్ చేసుకుంటున్నారట. ఏ వాళ్లిద్దరు అక్కడకు వెళ్లి మరి ఎందుకు రొమాన్స్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరు అడ్డొచ్చారు అంటే ఇక్కడ డిస్ట్రబ్ చేస్తున్నారనో ఏమో కాని ఈ జంట రోం దాకా వెళ్లి అక్కడ రొమాన్స్ కు సిద్ధమయ్యారు. ఇంతకీ అక్కడకు వెళ్లి మరి రొమాన్స్ చేస్తున్న ఆ జోడీ ఎవరంటే యువ హీరో నితిన్ కన్నడ బ్యూటీ రష్మిక అని తెలుస్తుంది. వీరి రొమాన్స్ రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లోనే అని తెలుస్తుంది.

నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరక్షన్ లో వస్తున్న సినిమా భీష్మ. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబందించిన రొమాంటిక్ సీన్స్ కొన్ని రోం లో షూట్ చేస్తున్నారట. నితిన్, రష్మిక జోడీ బాగా కుదిరింది. సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఛలో సినిమాతో హిట్ అందుకున్న వెంకీ కుడుముల ఈ సినిమాతో హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో పాటుగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు నితిన్. ఆ మూవీలో కీర్తి సురేష్ తో రొమాన్స్ చేస్తున్నాడు నితిన్. ఇదే కాదు చంద్రశేఖర్ యేలేటి సినిమాలో కూడా నటిస్తున్నాడు నితిన్. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ హీరోయిన్ గా చేస్తుంది. వరుసగా సినిమాలు చేయడమే కాదు క్రేజీ బ్యూటీస్ తో రొమాన్స్ చేస్తున్నాడు నితిన్.

Share.