నేహా శర్మ ప్రస్తుతం బాలీవుడ్ లో అంతగా ఆఫర్స్ లేకపోయినా ఏదో ఒక ఫోటోషూట్ తో సినీ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. గతంలో తెలుగులో రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత సినిమాలో నేహా శర్మ హీరోయిన్ గా నటించింది. అటు తర్వాత నేహా కి అనుకున్నంత స్థాయిలో ఆఫర్స్ రాలేదు. వరుణ్ సందేశ్ హీరోగా ‘కుర్రాడు’ అనే ఒక తెలుగు సినిమాలో దర్శనమిచ్చింది ఈ అందాల నటి.
ఇక తెలుగులో తనకి తగినంత గుర్తింపు దక్కలేదని బావించిందేమో బాలీవుడ్ కి వెళ్లి తన అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ కూడా నేహా కి తగిన గుర్తింపు రాలేదు స్టార్ హీరోల సరసన అవకాశాల కోసం ఎదురు చుసిన నిరాశ తప్పలేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులని తనవైపు తిప్పుకోవటానికి కొన్ని బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తుంది. అందులో భాగంగా ఈ రోజు నేహా శర్మ తన ఆఫీషియల్ ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా మ్యాక్సిమ్ కవర్ పేజీ కోసం దిగిన కొన్ని ఫోటోలని షేర్ చేసింది, ఇందులో నేహా చాల అందంగా బికినీ లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తున్నాయి.