దాదా సాహెబ్ ఫాల్కే బెస్ట్ యాక్టర్ అవార్డ్ సొంతం చేసుకున్నా నవీన్..?

Google+ Pinterest LinkedIn Tumblr +

నవీన్ పోలిశెట్టి..ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్న పేరు. జాతిరత్నాలు సినిమా రాక ముందు నవీన్ పోలిశెట్టి పేరు అంతగా తెలీదు. అయితే నవీన్ పోలిశెట్టి అంతక ముందే సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ చేసి మెప్పించాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, వన్ నేనొక్కడినే, వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేశాడు. ఆ తర్వాత ఏజంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా చేసి అందర్నీ మెప్పించాడు. 

ప్రస్తుతం ఆ సినిమాకు గాను నవీన్ దాదా సాహెబ్ ఫాల్కే బెస్ట్ యాక్టర్ అవార్డ్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నవీన్ పోలిశెట్టి తెలిపాడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఏజెంట్ సినిమాకు రావడం ఎంతో ఆనందంగా ఉందంటూ ఈ యువ హీరో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కరోనా రీత్యా అవార్డు ఫంక్షన్ నిర్వహించలేదని, తనకు ఆ అవార్డును కొరియర్ ద్వారా పంపినట్టుగా తెలిపాడు.

Share.