నితిన్ భీష్మ్ ప్రీరిలీజ్ బిజినెస్ మాములుగా లేదుగా?

Google+ Pinterest LinkedIn Tumblr +

కొత్త త‌ర‌హా సినిమాలు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల `మ‌హ‌ర్షి`తో దేశానికి కావాల్సింది కార్పెరేట్‌లు కాదు హ‌లం ప‌ట్టి పొలం దున్ని ప‌దిమందికి అన్నం పెట్టే రైత‌న్న అని చాటి చెప్పారు. తాజాగా ఇదే స్టైల్ లో రైతు గురించి, సేంద్రియ సేద్యం గురించి మ‌రో సినిమా వ‌స్తోంది.

నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం `భీష్మ‌`. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై సూర్యదేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. టీజ‌ర్‌లో అమ్మాయిలంటే ప‌డిచ‌చ్చే రోమియోగా, వాళ్ల‌ని దూరంపెట్టే యువ‌కుడిగా నితిన్ క‌నిపించాడు. సోమ‌వారం విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌లో మాత్రం అస‌లు క‌థ‌ని రివీల్ చేసేశారు. `భీష్మ‌` అనే పేరుతో సేంద్రియ వ్య‌వ‌సాయాన్ని ఓ ఉద్య‌మంలా హీరో న‌డిపిస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. అత‌నికి అడుగ‌డుగునా అడ్డుత‌గిలే ఓ కార్పొరేట్ విల‌న్‌.. వీరిద్ద‌రికీ మ‌ధ్య జరిగే కార్పెరేట్ వార్ నేప‌థ్యంలో మంచి సందేశాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తోంది.

ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం అప్పుడే అయిపోయింది. సుమారు 23.2 కోట్ల‌కు థియేట్రిక‌ల్ రైట్స్ కు వ‌చ్చింది. అంటే నిర్మాత‌లు పెట్టిన ఇన్వెస్టిమెంట్‌కి దాదాపుగా వ‌చ్చేసిన‌ట్లే. ఏరియా వైజ్ థియేట్రిక‌ల్ రైట్స్‌….

నైజాం: రూ 7.20 కోట్లు
వైజాగ్‌: రూ 2.70 కోట్లు
సీడెడ్‌: రూ 3.05 కోట్లు
తూర్పు: రూ 1.50కోట్లు
ప‌శ్చిమ‌: రూ 1.25 కోట్లు
కృష్ణా: రూ 1.45 కోట్లు
గుంటూరు: రూ 1.75కోట్లు
నెల్లూరు: రూ 0.75 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం: 19.64కోట్లు

ప్ర‌పంచ వ్యాప్తంగా : 23.2 కోట్లు

Share.