రిలీజ్‌కు ముందే చిక్కుల్లో పడ్డ నర్తనశాల

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ హీరో నాగ శౌర్య నటించిన లేటెస్ట్ మూవీ నర్తనశాల రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఛలో వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత నాగశౌర్య ఈ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్ర టీజర్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 31న రిలీజ్ కాబోతున్న నర్తనశాలకు కొత్తగా చిక్కులు వచ్చి పడ్డాయి.

ఈ సినిమాలో నాగశౌర్య ఒక గే పాత్రలో నటించనున్నాడు. ఇందులో మనోడికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు అనేది టీజర్ చూస్తే స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు ఇదే నాగశౌర్య కొంప ముంచింది. తమ మనోభావాలు దెబ్బ తినే విధంగా ఇందులో చూపించారంటూ హిజ్రాలు గొడవకు రెడీ అవుతున్నారు. ఇందులో తమను కించపరిచే విధంగా చూపించారంటూ వారు ఆరోపిస్తున్నారు. దీంతో వారు సినిమాను రిలీజ్ కాకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే చిత్ర యూనిట్ మాత్రం ఇందులో హిజ్రాలు కించపరిచే అంశాలు ఏమీ లేవని.. ఇదొక పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్ అని అంటున్నారు. మరి ఈ విషయం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.

Share.