‘నన్ను దోచుకుందువటే’ టీజర్

Google+ Pinterest LinkedIn Tumblr +

సుధీర్ బాబు తొలి సారి నిర్మాత గా మారిన తర్వాత నిర్మిస్తున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. నాభ నటేశ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ రోజు ఉదయం సుధీర్ బాబు తన అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఈ చిత్ర స్టీలర్ ని విడుదల చేసారు. స్టీలర్ ని బట్టి ఇది ఒక క్యూట్ ప్రేమ కథ చిత్రం అని తెలుస్తుంది.
సుధీర్ బాబు స్థాపించిన నిర్మాణ సంస్థ ‘ సుధీర్ బాబు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం ఒక సరికొత్త కామెడీ తో కూడుకున్న ప్రేమ కథ చిత్రం అని టీజర్ చూసిన వారికీ తెలుస్తుంది. సుధీర్ బాబు ఈ చిత్రం లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడు. ప్రస్త్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే నెల ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి చిత్ర బృందం వారు సన్నాహాలు చేస్తున్నారు. సమ్మోహనం సినిమా తో మంచి ఘన విజయాన్ని అందుకున్న సుధీర్ బాబు కి ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని ఇస్తుందని కోరుకుందాం.

Share.