నాని 25.. హీరో కాదు విలన్!

Google+ Pinterest LinkedIn Tumblr +

నేచురల్ స్టార్ నాని ఇటీవల జెర్సీ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. నేచురల్‌గా యాక్ట్ చేసే నానికి మంచి కంటెంట్ తగిలితే ఆ సినిమా ఎలా ఉంటుందో జెర్సీ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమాలో మనోడి యాక్టింగ్‌కు పడ్డ మార్కులు మామూలుగా లేవు మరి. ఇంతలా ఇంప్రెస్ చేసిన నాని అప్పుడే తన నెక్ట్స్ మూవీని కూడా స్టార్ట్ చేశాడు.

నానిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్‌లో మరోసారి నాని నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా నాని కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ 25వ సినిమా కావడంతో ఈ సినిమా ఎలాంటి కంటెంట్‌తో వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు జనం. అయితే వారంది ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశాడు నాని. ఈ సినిమాలో నాని హీరో కాదట.. ఒక బ్యాడ్ విలన్‌గా నాని నటిస్తున్నట్లు స్వయంగా ఆయనే చెప్పాడు. ట్విట్టర్‌లో నాని పోస్ట్ చేసిన ట్వీట్ దీనికి సాక్ష్యం. ఇదొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అని.. అందుకే ఇందులో విలన్‌గా నటిస్తున్నాననంటూ నాని ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమాలో మరో యంగ్ హీరో సుధీరో బాబు కూడా నటిస్తున్నాడు.

షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమాలో నివేదా థామస్, అదితిరావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో రానున్న ఈ సినిమాలో నాని యాక్టింగ్ ఎలా ఉంటుందా అని చాలా ఆసక్తిగా చూస్తున్నారు జనం. మరి నాని ల్యాండ్ మార్క్ 25వ మూవీలో నాని ఎలా కనిపిస్తాడో చూడాలి.

Share.