‘ గ్యాంగ్‌లీడ‌ర్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌… నాని టార్గెట్ ఎంతంటే

Google+ Pinterest LinkedIn Tumblr +

న్యాచురల్ స్టార్ నాని.. టాలెంటెడ్ ఫిలిం మేకర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెర‌కెక్కుతోన్న సినిమా గ్యాంగ్‌లీడ‌ర్‌. మెగాస్టార్ చిరంజీవి సూప‌ర్ హిట్ ఫిల్మ్ టైటిల్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ నెల 13 ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నా ప్ర‌మోష‌న్ల ప‌రంగా కాస్త వీక్‌గానే క‌న‌ప‌డుతోంది.

ట్రేడ్ వ‌ర్గాల్లోనూ గ్యాంగ్‌లీడ‌ర్‌పై మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ అందుకు సాక్ష్యం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థియేట్రికల్ రైట్స్ రూపంలోదాదాపు రూ. 28 కోట్లు వచ్చాయి. నాని మార్కెట్ రేంజ్ కు ఇది భారీ ఫిగ‌ర్ అని చెప్ప‌క‌పోయినా మీడియం రేంజ్ రేటు ప‌లికింద‌నే చెప్పాలి. ఇక జెర్సీ సినిమాతో మంచి హిట్ కొట్టిన నాని మ‌రి గ్యాంగ్‌లీడ‌ర్ సినిమాతో ఏం చేస్తాడో ? చూడాలి.

ప్రపంచవ్యాప్తంగా నాని గ్యాంగ్ లీడర్ ప్రీరిలీజ్ బిజినెస్ (రూ.కోట్ల‌లో )

నైజామ్ – 8.10

సీడెడ్ – 3.50

ఉత్తరాంధ్ర – 2.55

కృష్ణ – 1.50

గుంటూరు – 1.70

ఈస్ట్ – 1.65

వెస్ట్ – 1.25

నెల్లూరు – 0.80
——————————–
ఎపీ + తెలంగాణా = 21.05
——————————-

Share.