ప్రతిరోజు పండుగే అంటున్న తేజ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎవరికైనా నెలకో, పదిహెను రోజులకో, లేకపోతే ఐదు పదిరోజులకే పండుగలు వస్తుంటాయి.. కానీ ఇక్కడ మాత్రం ప్రతిరోజు పండుగేనంట.. అదేలా సాధ్యం.. కానీ సాధ్యమే అంటున్నాడు మేగాహీరో సాయిధరమ్ తేజ్. తాను ఇప్పుడు నటిస్తున్న చిత్రం ప్రతిరోజు పండుగే. ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లుంది.. అందుకే ఈసినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంను మొదలు పెట్టారు.

ప్రతిరోజు పండుగే అంటున్న సాయిధరమ్ తేజ్ ఈరోజు ఫ్రీ లుక్ను విడుదల చేశాడు. రేపు ఫస్ట్లుక్ చేసేందుకు సన్నహాల్లో భాగంగా ఫ్రీ లుక్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. యూవీ క్రియోషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్త ఆధ్వర్యంలో అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా వస్తుంది. సంగీతం ఎస్ ఎస్ తమన్ స్వరాలు సమకూర్చుతున్నారు. ఇక మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా ఫ్రీ లుక్ విడుదల బుదవారం రాత్రి 8గంటలకు విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారట. ఫ్రీ లుక్లో ఇద్దరు ఒకరి చేయిని మరోకరు అభయ హాస్తం ఇస్తున్నట్లు రూపొందించారు. వేలు విడవని బంధం అంటూ క్యాప్షన్ ఇచ్చి పోస్టర్ను సోషల్ మీడియా ఖాతాలో చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈసినిమా ఫస్ట్లుక్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Share.