కోట్ల హీరో కాస్తా ల‌క్ష‌ల హీరో అయిపోయాడు…

Google+ Pinterest LinkedIn Tumblr +

అక్కినేని నాగార్జున పరిస్థితి సినిమా సినిమాకూ దయనీయంగా తయారవుతోంది. కొన్నేళ్ల కిందట నాగ్ మార్కెట్ ద‌య‌నీయంగా ప‌డిపోయింది. ఆ టైంలో మ‌నం, సోగ్గాడే చిన్ని నాయ‌న, ఊపిరి లాంటి వ‌రుస హిట్ల‌తో భలేగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు నాగ్. కెరీర్లో ఆ దశలో రూ.50 కోట్ల షేర్ సినిమా నాగ్ నుంచి వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ‘సోగ్గాడే’తో ఆ ఫీట్ అందుకుని ఆశ్చర్యపరిచాడు.

నాగ్ వ‌రుస హిట్లు చూసి సీనియ‌ర్ హీరోలే షాక్ అయ్యారు. అయితే ఆ స‌క్సెస్ నాగ్ త్వ‌ర‌లోనే కోల్పోయాడు. అప్ప‌టి నుంచి ప‌స‌లేని క‌థ‌లు, త‌లాతోకా లేని వ‌ర్మ లాంటి డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేసి మార్కెట్ పోగొట్టుకున్నాడు. ఇక ఓవ‌ర్సీస్‌లో డిజాస్ట‌ర్ల మీద డిజాస్ట‌ర్లు ఇస్తున్నాడు. ఇటు తెలుగు రాష్ట్రాల‌తో పాటు నాగ్ ఓవ‌ర్సీస్ మార్కెట్ కూడా ఢ‌మాల్ అయ్యింది.

అతిథి పాత్ర చేసిన ‘నిర్మలా కాన్వెంట్’, తనకు అచ్చొచ్చిన జానర్లో చేసిన ‘ఓం నమో వేంకటేశాయ’ పెద్ద డిజాస్టర్లయ్యాయి. ‘రాజు గారి గది-2’ అంచనాల్ని అందుకోలేకపోయింది. ‘ఆఫీసర్’ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నానితో క‌లిసి చేసిన దేవ‌దాస్ కూడా నిరాశ‌ప‌రిచింది. ఇక మ‌న్మ‌థుడు 2 రిలీజ్‌కు ముందు ఎంత హంగామా చేశారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

రెండేళ్ల క్రితం వ‌ర‌కు సినిమాలు ప్లాప్ అయినా నాగ్ సినిమాలు ఏరియాల వారీగా తొలి వారాంతంలో ప్రతి రోజూ కోట్లల్లో వసూళ్లు రాబట్టేవి. కానీ ఇప్పుడు షేర్ లక్షలకు పడిపోయింది. పాజిటివ్ బజ్ ఉండి కూడా మన్మథుడు-2 తెలంగాణ మొత్తంలో తొలి రోజు కోటి రూపాయల షేర్ రాట్టలేదు. రూ.97 లక్షలే షేర్ వచ్చింది. ఈ సినిమా టార్గెట్ రూ.24 కోట్లు. నాగ్ అభిమానులు ఇది త‌మ హీరోకు కేక్ వాక్ అని గొప్ప‌లు పోయారు. ఇప్పుడు ప‌రిస్థితి చూస్తుంటే ఎంత ఘోరంగా ప‌రువు పోయిందో తెలుస్తోంది.

Share.