విజయ్ విషయంలో ఆ సంస్థ వెనక్కి తగ్గిందా?

Google+ Pinterest LinkedIn Tumblr +

పెళ్ళిచూపులు సినిమాతో హీరోగా మంచి క్రేజ్ దక్కించుకున్న హీరో విజయ్ దేవరకొండ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నాడు. ఇక గీతాగోవిందం సినిమాతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీ సూపర్ సక్సెస్ అయ్యింది. దాంతో డీయర్ కామ్రెడ్ సినిమాలో మరోసారి కలిసి నటించారు. ఈ సినిమా రిలీజ్ కి ముందు భారీ స్థాయిలో ప్రమోషన్ వర్క్ కూడా చేశారు.

వాస్తవానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్న ఎన్నో వాయిదాలు వేస్తూ మొత్తానికి రిలీజ్ చేశారు. ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయిన డీయర్ కామ్రెడ్ సక్సెస్ అయినా నిరాశే పరిచంది. అయితే ఈ సినిమా లెంగ్త్ ఎక్కువ కావడంతో రిజల్ట్ తేడా వచ్చింది. ఈ సినిమాలో లెంగ్త్ తగ్గించి రిలీజ్ చేసుంటే ఫలితం మరోలా ఉండేది. మేకర్స్ వెంటనే మేల్కొని 10 నిమిషాలకు పైగా సినిమా కట్ చేసారు. అయినా మౌత్ టాక్ వెళ్లిపోయింది కాబట్టి ఏం చేయలేక పోయారు. పైగా కొత్త సినిమాల రాక, మిక్సిడ్ టాక్ రావడంతో నిరాశే పరిచింది. అయితే ఈ ఎఫెక్ట్ కలెక్షన్లపై కూడా పడిందని అంటున్నారు.

అంతే కాదు సంగీతం, ఫోటోగ్రఫీ, కంటెంట్ అన్ని బాగానే ఉన్నా ఈ మూవీ అనుకున్న స్థాయిలో అంటే విజయ్ దేవరకొండ ప్రీవియస్ సినిమా స్థాయిలో ఆకట్టుకోలేదని జనం టాక్. విజయ్, రష్మికల కెమిస్ట్రీ కూడా యూత్ కి కనెక్టయింది కానీ.. ఫ్యామిలీ ఆడియెన్స్ తో సినిమాకు దెబ్బకొట్టింది. అయితే ఇండస్ట్రీ అంటే ఏ చిన్న అపజయం వచ్చినా.. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు వెంటనే అలర్ట్ కావడం చూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ తో భారీ బడ్జెట్ తో నిర్మించాలనుకున్న మైత్రీ మూవీస్ వెనక్కు తగ్గే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇదివరకే వీరిద్దరి మధ్యా డీల్ కుదిరినా ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనని అంటున్నారు. కాకపోతే ఈ విషయం పై ఎలాంటి అఫిషియల్ వార్తలు రాలేదు..సోషల్ మీడియాలో మాత్రం ఈ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

Share.