రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ పై నాగ శౌర్య షాకింగ్ కామెంట్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ యువ కథానాయకుడు నాగ శౌర్య నటించిన తాజా చిత్రం ‘ నర్తనశాల ‘ కొద్దీ రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు హీరో నాగ శౌర్య, అందులో భాగంగా నిన్న కొన్ని యూ ట్యూబ్ చానెల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఆ ఇంటర్వ్యూ లో హీరో రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు నాగ శౌర్య. టాలీవుడ్ లో హీరోలకి ఉన్న స్టార్ డమ్ వారిని వెర్రిగా అభిమానించే ఫ్యాన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్, స్టార్ డమ్ అనేది హీరో రామ్ చరణ్ గారితోనే అంతం అయిపోయిందని. ఇప్పుడు అటువంటి ట్రెండ్ ఏమిలేదని, గతంలో సినీ స్టార్స్ ని దేవుళ్లుగా కొలిచే వారని ఇప్పుడు ఆ ట్రెండ్ లేదని చెప్పారు. ప్రస్తుతం అందరు స్టార్స్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పబ్లిక్ లోకి తరచుగా వెళుతూనే ఉన్నారని, ఫ్యాన్స్ కూడా తమ అభిమాన తారలాని తరచుగా కలుస్తూనే ఉండటంతో మేము కూడా వారి లనే సాధారణ ప్రజలుగా కలిసిపోయాం అని తెలిపారు నాగ శౌర్య.

ఇంకా ఇంటర్వ్యూ లో భాగంగా నాకు జీవితంలో ఒక్క రోజైన పవన్ కళ్యాణ్ గారిలాగా అవ్వాలని ఉందని, నిద్ర లేచిన వెంటనే అయన లాగా మారిపోతే నేను కొన్ని క్రేజీ పనులు చేస్తానని అయన సరదాగా చెప్పారు. నేను కానీ ఒక రోజు పవన్ కళ్యాణ్ గారి లాగా అయితే వెంటనే ట్విట్టర్ లో నాగ శౌర్య గురించి ట్వీట్ చేస్తానని తెలిపారు.

Share.