అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘శైలజ రెడ్డి అల్లుడు’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు చైతూ. కాగా తన భార్య సమంతతో కలిసి శివ నిర్వాన డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్నాడు అక్కినేని బుల్లోడు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ యూనిట్ వర్గాల్లో వినిపిస్తోంది.
గుండెల్ని హత్తుకునే మంచి ప్రేమకథ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘మజిలీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయనున్నారు చిత్ర యూనిట్. దీనికి సంబంధించి ఈ టైటిల్‌ను ఫిలిం చాంబర్‌లో రిజిష్టర్ కూడా చేయించారట చిత్ర యూనిట్. ఏం మాయ చేశావె, ఆటోనగర్ సూర్య, మనం వంటి సినిమాల తరువాత ఇప్పుడు నాలుగోసారి ఈ జంట మనముందుకు రానుండంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాతో ఈ జోడి మరోసారి హిట్ కొడతారని ధీమాగా ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.