దయచేసి నా పేరు అలా వాడకండి: మెహ్రీన్ కౌర్

Google+ Pinterest LinkedIn Tumblr +

నటి మెహ్రీన్ కౌర్ ఈ రోజు ఉదయం తన అభిమానులని ఉద్దేశించి ఒక ట్వీట్ చేసింది. తాజాగా కేరళ రాష్ట్రము లో కురుస్తున్న బారి వర్షాలకు అక్కడ జరిగిన నష్టం అందరికి తెలిసిందే. సినీ ఇండస్ట్రీ లోని ప్రముఖులు అంత ఎవరికీ తోచిన విరాళం వారు కేరళ సహాయ నిధికి డొనేట్ చేస్తూనే ఉన్నారు. అయితే విజయవాడ లోని మెహ్రీన్ అభిమాన సంఘాల సభ్యులు కొద్దీ రోజుల క్రితం ‘మెహ్రీన్ ఫ్యాన్స్ అంటూ ఆమె పేరు వాడుకుంటూ కేరళ సహాయ నిధికి వరద బాధితులకి తగిన సహాయం చేయాలంటూ సోషల్ మీడియా లో కొన్ని సందెషలను పంపుతున్నారు. ఇది చుసిన మెహ్రీన్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా
” నా ఫ్యాన్స్ అందరికి ఒక చిన్న విజ్ఞప్తి దయచేసి ఎవరిని నా పేరు చెప్పి విరాళాలు సేకరించకండి, సహాయం చేయటమనేది వారి పర్సనల్ ఒపీనియన్, అయినా నేను మీ సేవ దృక్పధాన్ని గౌరవిస్తున్న, కానీ అలా నా పేరు చెప్పి డబ్బులు అడగొద్దు..ఎవరికైనా ఆర్ధిక సహాయం చేయాలంటే నేనే స్వయంగా చేస్తానని అనేక సార్లు చేశాను కూడా అని వెల్లడించింది మెహ్రీన్ కౌర్.

Share.