యంగ్ టైగర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అరవింద సమతే’ కోసం యావత్ టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. కాగా ఈ సినిమాతో తారక్ మరోసారి బీభత్సం సృష్టించడం ఖాయం అని ఫిక్స్ అయ్యారు నందమూరి ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమా టీజర్ పవర్‌ఫుల్‌గా ఉండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు సాధిస్తుందా అని లెక్కలు వేస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
తారక్ నటిస్తున్న అరవింద సమేత చిత్రంలో మెగాస్టార్ కూడా నటిస్తున్నాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ఇదే టాపిక్. తారక్ లాంటి స్టార్ హీరో చిత్రంలో మెగాస్టార్ నటిస్తున్నాడంటే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఈ మెగాస్టార్ మన చిరంజీవి కాదండోయ్. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అరవింద సమేత చిత్రంలో ఒక కేమియో రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ చేశారట బిగ్ బి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రంలోనూ అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తారక్ సినిమాలో కూడా ఆయన నటిస్తుండటంతో ఆయన ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడా అనే ఆతృత ప్రేక్షకుల్లో నెలకొంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో తారక్ అదిరిపోయే లుక్‌లో కనిపిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోయడం ఖాయం అంటున్నారు నందమూరి అభిమానులు.