స్వలింగ సంపర్కం, స్టార్ హీరోల పై షాకింగ్ కామెంట్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ మోడల్ మహిక శర్మ ఈ రోజు స్వలింగ సంపర్కం పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం భారత దేశంలో ఉన్న
సెక్షన్ 377 చట్టానికి సంపూర్ణ మద్దతు తెలపాలని, భారత రాజ్యాంగం లో దీనికి చట్ట బద్ధత కల్పించాలని ఆమె కోరుకున్నారు. అంతే కాకుండా ఆమె మరి కొన్ని సంచలన నిజాలు బయట పెట్టారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా వెలిగిపోతున్న చాల మంది హీరోలలో కొంత మంది స్వలింగ సంపర్కులెనని ఆమె చెప్పారు.

అంతే కాకుండా తనకి ఉన్న స్నేహితులతో కూడా కొంత మందికి ఈ అలవాటు ఉందని పేర్కొన్నారు. మన దేశంలో అత్యాచారాలకు పాల్పడే వారికీ కావాల్సినంత స్వేచ్ఛ ఉంది, కానీ స్వలింగ సంపర్కులకు మాత్రం లేదు, అసలు నిజానికి వీరికి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు ఈ విధమైన అనుభూతిని ఎంతో ఇష్టపడతారని వెల్లడించింది. అంతే కాకుండా ఆ విధమైన అనుభూతిలో తప్పు ఏం లేదని మహిక తెలిపారు.

Share.