ప్రిన్స్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మహేష్ వరుస వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. వంశీపైడి పల్లి దర్శకత్వం లో వస్తున్న మహర్షి సినిమా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఏప్రిల్ 5న మహర్షి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మహేశ్ సినిమా ఉండనుంది. ఈ సినిమా హీరోయిన్ కోసం ఇప్పటికే అనేకమందిని పరిగణలోకి తీసుకున్నారట.
నేనొక్కడినే” తర్వాత సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చే చిత్రం పీరియాడికల్ డ్రామాగా ఉండబోతోందట. ఇలాంటి కథకు కత్రినా పర్సనాలిటీ బాగా సూటవుతుందని, అందుకే ఆమెను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు మహేష్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్, కైరా అద్వానీ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కానీ కత్రీనా అయితేనే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నారట.
ప్రస్తుతం ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కెరియర్ ఆరంభంలో కత్రినా ఇక్కడ మల్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. ప్రస్తుతం కత్రినా కైఫ్ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న ‘భారత్’ అనే చిత్రంలో నటిస్తున్నారు.13 ఏళ్ల క్రితం క్రితం మల్లీశ్వరిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన కత్రినా కైఫ్ ఆ తర్వాత బాలయ్యతో అల్లరి పిడుగు చేసింది.