ప్రముఖ మిస్ ఇండియా శోభిత ధూళిపాళ్ల తాజాగా నటించిన చిత్రం ‘గూఢచారి’ ప్రస్తుతం ఈ సినిమా మంచి హిట్ టాక్ దూసుకువెళ్తుంది. అమెరికా లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తుంది. విడుదలైన నాలుగవ రోజే ఈ సినిమా బయర్లని లాభాల బాటలో పడేసింది. అమెరికా లో గూఢచారి ఈ వారం లో వన్ మిలియన్ మార్క్ చేరుకోవచ్చు అని ట్రేడ్ పండితుల అంచనా.
అయితే ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడుకి మరియు హీరో అడివి శేష్ కి ఇండస్ట్రీ ప్రముఖులు స్టార్ హీరో ల నుండి ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ఇలా తాజాగా హీరో మహేష్ బాబు కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అడివి శేష్ మరియు చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలిపారు.
దీనికి స్పందించిన నటి శోభిత జస్ట్ థాంక్ యు అని సమాధానం ఇచ్చింది. ఇదే మహేష్ అభిమానులకి కోపం తెప్పించింది. అంతటి స్టార్ హీరో మెసేజ్ కి జస్ట్ థాంక్ యు అని సమాధానము చెప్పటం ఏంటని…సర్ అని కానీ మహేష్ గారు అని సంభోదించాలని ఆమెకి మహేష్ ఫ్యాన్స్ క్లాస్ పీకారు. ఇండస్ట్రీ కి వచ్చినా కొత్తలోనే అది కేవలం ఒకే ఒక సినిమా లో నటించిన నీకు అప్పుడే ఇంత అహంకారం పనికి రాదని ట్రోల్ చేసారు మహేష్ ఫ్యాన్స్.
Thank you! https://t.co/QNtbGOoo7T
— Sobhita Dhulipala (@sobhitaD) August 7, 2018