సూపర్ స్టార్ మహేష్ బాబు తన అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా నిన్న రాత్రి ” నన్ను దోచుకుందువటే ” చిత్రంలోని ‘ బిగ్ బాస్ ‘ అనే గీతాన్ని విడుదల చేసారు. ప్రముఖ యువ కథానాయకుడు సుధీర్ బాబు ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. సుధీర్ బాబు సొంత నిర్మాణ సంస్థ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నాభ నటేశ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఆర్ ఎస్ నాయుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఆజనేషు సంగీతం అందించారు. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు తన బావ మరిది సుధీర్ బాబు సినిమాకి మరో సారి తన వంతు సహాయం అందించారు. ఈ చిత్రంలోని బిగ్ బాస్ పాటని విడుదల చేసి సుధీర్ బాబుకి, మరియు సినిమా యూనిట్ సభ్యులు అందరికి తన శుభాకాంక్షలు తెలిపారు మహేష్, నన్ను దోచుకుందువటే సినిమాని ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 13 న ప్రేక్షకుల ముందుకి రానుంది.
Happy to launch #BigBossAnthem. Best wishes to @isudheerbabu & good luck to the entire team of #SudheerBabuProductions. #NannuDochukunduvateOnSep13 @sbpoffl_
https://t.co/t22h2Y7iMv— Mahesh Babu (@urstrulyMahesh) August 20, 2018