మహర్షి సినిమా తరువాత వరుసగా సినిమాలు చేసేందుకు ప్రిన్స్ మహేష్‌బాబు సైన్‌లు చేస్తున్నాడు. మహర్షి విజయంతో జోరుమీదున్న మహేష్ బాబు వెంట వెంటనే సినిమాలు చేయనున్నాడు. కాల్షీట్స్ ఖాళీగా ఉండకుండా చూసుకుంటున్నాడు. మహర్షి సినిమా మహేష్ బాబు కేరిర్‌లో 25వ చిత్రం. ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలు పట్టాలెక్కెందుకు సిద్దంగా ఉన్నాయి. మహేష్ బాబుకు గుక్క తిప్పుకోకుండా ఈ రెండు సినిమాలు షూటింగ్‌కు రెడి అన్నమాట.
మహేష్ బాబు ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాకు ఒప్పుకున్నాడు. ఈ సినిమా జూన్ మాసంలో షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే వెంటనే పరుశరామ్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో మహేష్ బాబు నటించనున్నారు. మహేష్ బాబును కలిసిన పరశురామ్ సినిమాకు సంబందించిన ఓ కాన్సెప్ట్ చెప్పడట. ఈ కాన్సెప్ట్ నచ్చటంతో వెంటనే మహేష్‌బాబు సరేనన్నాట. దేశం ఎదుర్కోంటున్న ఓ క్లిష్ట పరిస్థితిని కథగా ఎంచుకున్నాడట. ఈ కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమాను ముందుకు నడిపిస్తాడట.
మహేష్ బాబు ఈ మధ్య కాలంలో నటించిన శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి లాంటి సందేశాత్మక చిత్రాల్లో నటించాడు. పరుశరామ్‌తో నటించే సినిమా కూడా సందేశాత్మక కథనంతోనే తీస్తారట. పరశురామ్ ఎంచుకున్న ఈ కథ మహేష్ బాబుకు బాగా నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నాడని సమాచారం. పరశురామ్ ప్రముఖ దర్శకుడు శంకర్ ఎంచుకున్న కాన్సెప్ట్‌ను ఎంచుకుని ముందుకు పోతున్నాడట. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే 2020 కన్నా ముందే సినిమా షూటింగ్ ప్రారంభించవచ్చని తెలుస్తోంది. సో మహేష్ అభిమానుల కు ఇది తీపి కబురనే చెప్పాలి.